చిరంజీవి రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చేశావ్.. ఇప్పుడు చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావ్!: కేశినేనిపై బుద్ధా వెంకన్న ఆగ్రహం

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. తాజాగా కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జన్మఇస్తే ఆయన్ను కేశినేని నాని అనరాని మాటలు అన్నాడనీ, ప్రజారాజ్యం పార్టీని కూల్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ పునర్జన్మ ప్రసాదిస్తే, ఇప్పుడు ఆయన గురించి శల్యుడిలాగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై ఎవరు పోరాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఏం చేయాలో తెలియక కేశినేని నాని అబద్ధాలు ఆడుతున్నారనీ, ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చేముందు ఆడిన ఆటలు టీడీపీలో చెల్లవని స్పష్టం చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
budda venkanna
budha venkanna
Kesineni Nani
Twitter

More Telugu News